Friday, September 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అడ్డంకులు తొలిగిన కిషన్ రావుపల్లి రోడ్డు కష్టాలు.!

అడ్డంకులు తొలిగిన కిషన్ రావుపల్లి రోడ్డు కష్టాలు.!

- Advertisement -

స్టేజి-అనుమతులు
సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలోని కిషన్ రావు పల్లి నుంచి  భూపాలపల్లి జిల్లా కేంద్రం వరకు అతవిమార్గం నుంచి రహదారి నిర్మాణానికి మార్గం సుగమమైంది. అటవీ శాఖ నుంచి స్టేజి-2 అనుమతికి సంబంధించి నిధులు కేటాయించారు.అటవీ ప్రాంతంలో హద్దులు ఏర్పాటు చేయడంతో చెట్లను తొలగించెందుకు సన్నద్ధం అవుతున్నారు. టెండర్లు ఆహ్వానించడంతో రోడ్డు నిర్మాణానికి కదలిక రానుంది. ఇప్పటి వరకు భూపాలపల్లి వెళ్లాలంటే కాటారం మీదగా 60 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోంది. ఈ రహదారి నిర్మిస్తే సుమారు 40 కి. మీ. దూరాభారం తగ్గనుంది.

ఏడేళ్ల తర్వాత అడుగులు

తాడిచెర్ల-భూపాపల్లి రహదారి నిర్మాణంలో భాగంగా పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి మానేరుపై 2017లో రూ.50 కోట్లతో వంతెన నిర్మించారు. అక్కడి నుంచి పెద్దతూండ్ల వరకు తారు రోడ్డు పూర్తయింది. కిషన్రావుపల్లి మధ్య ప్రాంతంలో పనుల నిర్వహణకు అడ్డంకిగా మారింది. ఇటీవల అటవీ శాఖ స్టేజీ-1 అనుమతి రావడంతో రూ.4.67 కోట్లను చెల్లించారు. దీంతో భూపాలపల్లి సమీపంలోని వన్ ఇంక్లైన్ వరకు 7 కి. మీ. పొడవునా దారి నిర్మా ణానికి సమస్య తొలగిపోయింది. అటవీ శాఖ అధికారులు హద్దులు ఏర్పాటు చేసి చెట్లు తొల గించేందుకు నంబర్లు వేస్తున్నారు. కిషన్రావు పల్లి నుంచి భూపాలపల్లి వన్ ఇంక్లెన్ వరకు తారు రోడ్డు నిర్మాణానికి రూ.15 కోట్లతో టెండర్లు పిలిచారు. గడువు ముగియడంతో పనులు చేపట్టనున్నారు.

తగ్గనున్న దూరాభారం

తాడిచెర్ల నుంచి కాటారం మీదుగా భూపాలపల్లికి 60 కి.మీ. ఉంటుంది. పెద్దతూండ్ల అటవీ ప్రాంతంలో రోడ్డు నిర్మిస్తే 18 కి.మీ. దూరం మాత్రమే వస్తుంది. గోదావరిఖని నుంచి ఖమ్మంపల్లి వంతెన మీదగా అటవీ ప్రాంతంలోని మట్టి రోడ్డుపై ప్రయాణి స్తున్నారు. ఈ రోడ్డు నిర్మిస్తే రెండు జిల్లాలతోపాటు కోల్బెల్టు ప్రాంతాలకు రవాణా మెరుగు కానుంది.

స్టేజి-2 అనుమతులు రావడం సంతోషంగా ఉంది: చింతలపల్లి మలహల్ రావు.. మాజీ ఎంపీపీ

ఏళ్లుగా మండల ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న కిషన్ రావు పల్లి రోడ్డుకు స్టేజి-2అనుమతులు వచ్చాయి.ఇది చాలా సంతోషంగా ఉంది. మండల ప్రజల రవాణా కష్టాలు తీరుతాయి.వర్షాలు తగ్గుముఖం పట్టాక పనులు ప్రారంభం కానున్నాయి.రోడ్డు అనుమతులకు కృషి చేసిన రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు మండల ప్రజల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -