Sunday, March 1, 2026
E-PAPER
Homeఆదిలాబాద్రాష్ట్ర మొదటి బహుమతి సాధించిన కిష్టాపూర్ విద్యార్థిని

రాష్ట్ర మొదటి బహుమతి సాధించిన కిష్టాపూర్ విద్యార్థిని

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
ఇటీవల నిర్వహించిన ఫిజికల్ సైన్స్ రాష్ట్రస్థాయి టాలెంట్ పరీక్షలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల 9వ తరగతి విద్యార్థి ఏ.అనన్య మొదటి ర్యాంకు సాధించి పాఠశాలకు మరొకసారి రాష్ట్రస్థాయిలో చక్కటి గుర్తింపు తెచ్చిందని విద్యార్థి ఎ. అనన్య ను  గైడ్ టీచర్ కొట్టే రాజన్న ను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ శ్రీ రమేష్  శుక్రవారం  హైదరాబాదు నందు విద్యార్థికి  గైడ్ టీచర్ కు మెమొంటో తో పాటు సర్టిఫికెట్ మరియు ప్రైజ్ మనీగా రూII మూడు వేలను అందించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ గుండ రాజన్న  తెలిపారు. పాఠశాలలో జరిగిన జాతీయస్థాయి సైన్స్ దినోత్సవం నందు జన్నారం ఫారెస్ట్ డివిజన్ అధికారి శ్రీ రామ్ మోహన్   పాఠశాల ప్రధానోపాధ్యాయులు  గుండ రాజన్న గారు ఉపాధ్యాయ బృందంతో కలిసి విద్యార్థితో పాటు విద్యార్థి యొక్క తల్లిదండ్రులను పాఠశాలలో సన్మానించారు.

 రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం పట్ల  జిల్లా విద్యాశాఖ అధికారి  ఎస్ యాదయ్య , గ్రామ సర్పంచ్  వాసాల నరేష్ , అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్  మంగ, పాఠశాల ఉపాధ్యాయులు జాడి మురళి దాముక కమలాకర్, ఎ.గోవర్ధన చారి.బుచ్చి లింగయ్య ప్రకాష్,నగేష్, మణెమ్మ,జ్యోతిశీల, అశోక్, నరహరి శర్మ, కాంతయ్య, శ్రీనివాస్, వాసు, రజిత రాణి, సుస్మిత, అజీమ్. స్వప్న మరియు గ్రామస్తులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -