Tuesday, August 5, 2025
E-PAPER
Homeఆదిలాబాద్కిష్టాపూర్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించటం జిల్లాకు గర్వకారణం: డీఈఓ

కిష్టాపూర్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించటం జిల్లాకు గర్వకారణం: డీఈఓ

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
మండలంలోని కిష్టాపూర్ జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదివిన విద్యార్థులు ఉత్తమ 10 ఫలితాలు సాధించడం జిల్లాకే గర్వకారణమని  మంచిర్యాల జిల్లా డిఈఓ యాదయ్య అన్నారు. మంగళవారం మండలంలోని జెడ్పీఎస్ఎస్ కిష్టాపూర్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. 10వ తరగతి విద్యార్థుల పరీక్షలు  ప్రగతిపై  ఉన్నత లక్ష్యాలను ఏరకంగా చేరుకోవాలని సూచించారు. 10 తరగతి లో డిజిటల్ తరగతులను బోదిస్తున్న విధానాన్ని పరిశీలించారు. అలాగే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలన్నారు.. పాఠశాలలో వన మహోత్సవము లో భాగంగా పాఠశాలలో మొక్క ను నాటారు.

 గత సంవత్సరం రాష్ట్ర స్థాయిలో సాధించిన ఎస్ ఎస్ సి ఫలితాలు మరియు ఎన్.ఎం.ఎం.ఎస్ ఫలితాలు  బాసర IIIT లో 7 గురు విద్యార్థులు సీట్లు సాధించిడం పట్ల ప్రధానోపాధ్యాయులను ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు  గుండ రాజన్న  మండల విద్యాశాఖ అధికారి  ఎం విజయ్ కుమార్,జిల్లా సెక్టోరియల్ అధికారులు  చౌదరి  సత్యనారాయణ మూర్తి  పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు దాముక కమలాకర్ మరియు పాఠశాల ఉపాధ్యాయలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -