Saturday, November 8, 2025
E-PAPER
Homeఆదిలాబాద్కిష్టపూర్ విద్యార్థినుల రాష్ట్రస్థాయి విజయం

కిష్టపూర్ విద్యార్థినుల రాష్ట్రస్థాయి విజయం

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
తెలంగాణ రాష్ట్ర కళోత్సవాల లో భాగంగా రాజేంద్రనగర్‌లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ అఫ్ రూరల్ డెవలప్మెంట్ (TGIRD) హైదరాబాద్ వేదికగా నిర్వహించిన “ట్రెడిషనల్ స్టోరీ టెల్లింగ్” (Traditional Story Telling in English) రాష్ట్రస్థాయి పోటీల్లో జన్నారం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కిష్టాపూర్ విద్యార్థులు రాష్ట్రస్థాయి రెండో బహుమతి సాధించి ప్రతిభ చాటారు. విద్యార్థినులు ఎస్. అరవింద రాణి మరియు కే. వర్షిత లు అద్భుతమైన ప్రదర్శనతో రాష్ట్రవ్యాప్తంగా పాల్గొన్న అన్ని జిల్లాల విద్యార్థులను ఆకట్టుకున్నారు.

వీరు రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ చేతుల మీదుగా మెమెంటో, సర్టిఫికేట్ మరియు రూ.3000 నగదు బహుమతి స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రోత్సహించిన ఎస్కార్ట్, గైడ్ టీచర్స్ బానావత్ ప్రకాష్ , పాఠశాల ఉపాధ్యాయులు దాముక కమలాకర్  ఈ కార్యక్రమం లో విజేతలను జిల్లా విద్యాధికారి ఎస్. యాదయ్య , సెక్టోరల్ ఆఫీసర్లు సత్యనారాయణ మూర్తి, చౌదరి, లక్ష్మి, భరత్, మండల విద్యాధికారి విజకుమార్  పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుండ రాజన్న  అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీమతి మంగ  ఉపాధ్యాయ బృందం అభినందించారు. విద్యార్థుల ఈ విజయం జిల్లాకు గౌరవాన్ని తెచ్చిందని విద్యాధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -