- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: భారత్ వేదికగా వెస్ట్ విండిస్ ఇండియా మధ్య టెస్టు సీరిస్ మ్యాచ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ మూడో ఓవర్ లో కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. వెస్టిండిస్ పేసర్ జైడన్ సీల్స్ వేసిన బంతి నేరుగా అతని ఆయుపట్టుకు తగిలింది. దీంతో కేఎల్ రాహుల్ బాల్ ధాటికి మైదానంలో అల్లాడిపోయాడు. టీమిండియా ఫిజియో గ్రౌండ్‌లోకి వచ్చి తక్షణమే ప్రథమ చికిత్స అందించారు. దీంతో కేఎల్ రాహుల్ ఉపశమనం పొందాడు.
- Advertisement -