Tuesday, March 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రభుత్వ ఆస్పత్రిలో మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్స

ప్రభుత్వ ఆస్పత్రిలో మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్స

- Advertisement -

– రూ.3 లక్షల విలువ చేసే ఆపరేషన్‌ ఉచితం
నవతెలంగాణ-సుల్తాన్‌ బజార్‌

వైద్య విధాన పరిషత్‌ నాంపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వైద్య బృందం మహిళకు మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా చేసింది. మక్తల్‌ ప్రాంతానికి చెందిన శంకరమ్మ (65) కొంతకాలంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతోంది. నాంపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఆర్థోసర్జన్‌ డాక్టర్‌ శ్రీకాంత్‌ దేవరకొండ బృందం మహిళకు రెండు మోకాళ్ల ఆపరేషన్‌ చేసింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. నాంపల్లి ఏరియా ప్రభుత్వాస్పత్రిలో ఇప్పటివరకు 26 మోకాళ్ల మార్పిడి ఆపరేషన్‌లు విజయవంతంగా పూర్తి చేసినట్టు తెలిపారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఖర్చు అవుతుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా ఈ ఆపరేషన్‌లు నిర్వహించామని తెలిపారు. ఈ వైద్య బృందంలో డాక్టర్‌ మహ్మద్‌ మేజ్‌ అఫ్జల్‌, డాక్టర్‌ ఎం మోదుకూరు అనిల్‌ రెడ్డి, మత్తు డాక్టర్‌ గిరిధర్‌, డాక్టర్‌ శేషు కుమార్‌, ఆపరేషన్‌ థియేటర్‌ హెడ్‌ నర్స్‌ విజయ జ్యోతిని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రారెడ్డి, ఆర్‌ఎంఓ డాక్టర్‌ సంగారెడ్డి అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -