Saturday, February 28, 2026
E-PAPER
Homeఆటలుకరీబియన్లతో నాకౌట్‌ ఫైట్‌!

కరీబియన్లతో నాకౌట్‌ ఫైట్‌!

- Advertisement -

రేపు విండీస్‌తో భారత్‌ తాడోపేడో
నెగ్గితే సెమీస్‌కు, ఓడితే ఇంటిబాటే
ఐసీసీ 2026 టీ20 ప్రపంచకప్‌
శ్రీలంక శ పాకిస్తాన్‌ వేదిక : పల్లెకెలె
టైమ్‌ : రాత్రి 7 నుంచి ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో నేడు

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ రేసు రసవత్తరంగా మారింది. సూపర్‌8 గ్రూప్‌-1 నుంచి దక్షిణాఫ్రికా సెమీస్‌లో అడుగుపెట్టగా.. భారత్‌, వెస్టిండీస్‌ మరో బెర్త్‌ కోసం పోటీపడుతున్నాయి. ఆదివారం ఈడెన్‌గార్డెన్స్‌లో ఢకొీట్టనున్న భారత్‌, వెస్టిండీస్‌.. సూపర్‌8 పోరును క్వార్టర్‌ఫైనల్‌గా మార్చేశాయి. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు నేరుగా సెమీఫైనల్‌కు చేరుకోనుండగా, ఓడిన జట్టు ఇంటిబాట పట్టనుంది. వర్షం కారణంగా ఫలితం తేలకుంటే.. మెరుగైన నెట్‌రన్‌రేట్‌తో కరీబియన్లు సెమీస్‌లో అడుగుపెట్టనున్నారు. అభిమానులు, కార్పోరేట్‌ మార్కెట్‌ ఫోకస్‌ భారత్‌, వెస్టిండీస్‌ సూపర్‌8 పోరుపై నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను ప్రభావితం చేసే అంశాలు..

నవతెలంగాణ క్రీడావిభాగం
బ్యాటింగే బలం, బలగం ఇటు భారత్‌కు, అటు వెస్టిండీస్‌కు బ్యాటింగే అతిపెద్ద బలం, బలగం. టీ20 ఫార్మాట్‌లో భయమెరుగని బ్యాటింగ్‌ విధ్వంసం కరీబియన్ల సృష్టి. ఇప్పుడు ఆ కళలో ఆరితేరిన జట్టు భారత్‌. వికెట్‌ పడగానే, తర్వాతి బంతికే సిక్సర్‌ బాదటం అప్పుడు విండీస్‌లో చూశాం, ఇప్పుడు ఆ పని భారత్‌ చేస్తోంది. పేస్‌, స్పిన్‌, స్వింగ్‌ వ్యత్యాసం లేకుండా పరుగుల వరద పారించగల సమర్థులు ఇరు జట్టలో ఉన్నారు. అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, సంజు శాంసన్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్య సహా శివం దూబెలతో భారత బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా ఉంది. వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ పవర్‌ హిట్టర్లతో కిక్కిరిసింది. బ్రాండన్‌ కింగ్‌, జాన్సన్‌ చార్లెస్‌, రోవ్‌మాన్‌ పావెల్‌, షిమ్రోన్‌ హెట్‌మయర్‌, రూథర్‌ఫోర్డ్‌, షారు హోప్‌లతో కరీబియన్ల బ్యాటింగ్‌ లైనప్‌ భయంకరంగా కనిపిస్తోంది. ఆల్‌రౌండర్లు జేసన్‌ హోల్డర్‌, రొమారియో షెఫర్డ్‌, రోస్టన్‌ ఛేజ్‌లు ఈ బ్యాటింగ్‌ లైనప్‌కు అదనం. అయితే, ఇరు జట్ల బ్యాటింగ్‌కు ఒక్కటే వ్యత్యాసం. ఒత్తిడిలో భారత బ్యాటర్లు ఉత్తమ ప్రదర్శన కనబరించేందుకు తహతహలాడితే.. విండీస్‌ బ్యాటర్లు మూకమ్మడిగా చేతులెత్తేస్తారు. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఒత్తిడి సహజం. పవర్‌ప్లేలోనే విండీస్‌ను కట్టడి చేయగలిగితే.. ఒత్తిడిలో బ్యాటింగ్‌ లైనప్‌ కుప్పకూలుతుంది. దక్షిణాఫ్రికా ఆ పని విజయవంతంగా చేసి చూపించింది.

బౌలింగ్‌లో భారత్‌దే హవా
భారత బౌలింగ్‌ బృందం ప్రపంచ శ్రేణి పేసర్లు, స్పిన్నర్లతో బలంగా ఉంది. ఎకానమీ, యార్కర్లతో దుమ్మురేపే జశ్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌లు ఇటు పవర్‌ప్లేలో, అటు డెత్‌ ఓవర్లలో బ్యాటర్లకు చుక్కలు చూపింగలరు. మిడిల్‌ ఓవర్లలో వైవిధ్యభరిత స్పిన్‌ బౌలింగ్‌ భారత్‌ సొంతం. వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ భారత జట్టులో ఉన్నారు. పిచ్‌ నెమ్మదిస్తే.. మిడిల్‌ ఓవర్లలో విండీస్‌ బ్యాటర్లకు ముకుతాడు వేసేందుకు మన స్పిన్నర్లు సిద్ధంగా ఉంటారు. అకీల్‌ హొసేన్‌, మోటీ, రోస్టన్‌ ఛేజ్‌లు విండీస్‌ స్పిన్‌ బలగం. షమ్రా జొసెఫ్‌, జేడెన్‌ సీయల్స్‌, జేసన్‌ హోల్డర్‌, షెఫర్డ్‌లు పదునైన పేస్‌తో పవర్‌ప్లేలో పంజా విసరగలరు. కానీ విండీస్‌ బౌలింగ్‌ లైనప్‌కు నిలకడ లేదు. బ్యాటర్లు స్ట్రయిక్‌రొటెషన్‌తో విండీస్‌ బౌలింగ్‌ ప్రణాళికలను సులువుగా తికమక పెట్టగలరు.

సొంతగడ్డ అనుకూలత
నేడు విండీస్‌తో నాకౌట్‌ పోరులో టీమ్‌ ఇండియాకు మరో అనుకూలత సొంతగడ్డపై ఆడటం. సుమారు 90 వేల మంది అభిమానుల మద్దతుతో మైదానంలో అడుగుపెట్టడం సూర్యసేన ఆత్మవిశ్వాసం రెట్టింపు చేయగలదు. ఇదే సమయంలో విండీస్‌కు ఇది బలహీనతగా మారగలదు. భారత్‌, వెస్టిండీస్‌లు రెండు సార్లు పొట్టి కప్పును నెగ్గిన జట్లే, కానీ ఐసీసీ టోర్నమెంట్లలో ఎక్కువ సార్లు నాకౌట్‌ మ్యాచ్‌లు ఆడిన అనుభవం టీమ్‌ ఇండియా సొంతం.
మనదే పైచేయి, కానీ భారత్‌, వెస్టిండీస్‌ టీ20 ఫార్మాట్‌ ముఖాముఖిలో టీమ్‌ ఇండియాదే పైచేయి. కరీబియన్లపై 19 విజయాలు సాధించిన భారత్‌, 10 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. కానీ ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో రికార్డు కరీబియన్లకు అనుకూలం. పొట్టి ప్రపంచకప్‌లో ఇరు జట్లు నాలుగు సార్లు తలపడగా.. అందులో మూడింట వెస్టిండీస్‌ది పైచేయిగా నిలిచింది. స్వదేశంలో జరిగిన 2016 టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లోనూ వెస్టిండీస్‌ చేతిలో భారత్‌ ఓటమి పాలైంది. మరి, నేడు ఈడెన్‌గార్డెన్స్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

వరుణుడితో ముప్పు!
సూపర్‌8 గ్రూప్‌-1లో భారత్‌, వెస్టిండీస్‌ ంండు మ్యాచ్‌ల్లో ఓ విజయం సాధించాయి. నెట్‌ రన్‌రేట్‌ పరంగా విండీస్‌ ముందంజలో నిలువగా.. భారత్‌ నెట్‌ రన్‌రేట్‌ రుణాత్మకం. ఆదివారం ఇరు దేశాల సూపర్‌8 మ్యాచ్‌ వర్షంతో రద్దుగా ముగిస్తే.. మెరుగైన నెట్‌ రన్‌రేట్‌తో విండీస్‌ సెమీస్‌కు చేరుకుంటుంది. ఆతిథ్య జట్టు టైటిల్‌ వేట ఈడెన్‌గార్డెన్స్‌లోనే ముగిసే ప్రమాదం ఉంది. ఆదివారం కోల్‌కతాలో ఎటువంటి వర్షం సూచనలు లేకపోవటం భారత్‌కు శుభ పరిణామం. పగటి వేళ సాధారణ ఉష్ణోగ్రతలతో రాత్రి సమయంలో మంచు కురువనుంది. మ్యాచ్‌లో వర్షం సూచనలు లేవని వాతావరణ శాఖ సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -