– చైనీస్ తైపీపై 3-1గోల్స్‌తో భారత్ గెలుపు
– ఆసియా కప్ అండర్-20 మహిళల ఫుట్‌బాల్ టోర్నీ
బ్యాంకాక్(థాయ్‌లాండ్): ఆసియా కప్ అండర్-20 మహిళల ఫుట్‌బాల్ టోర్నీలో భారత్ నాకౌట్ ఆశలను సజీవంగా చేసుకుంది. బుధవారం జరిగిన గ్రూప్-బి చివరి లీగ్ మ్యాచ్‌లో భారతజట్టు 3-1గోల్స్ తేడాతో చైనీస్ తైపీపై విజయం సాధించింది. థాయ్‌లాండ్‌లోని పతుమ్ థాని స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళలజట్టు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. భుమిక దేవి ఖుముఖ్చమ్ 26వ నిమిషలో, శిబానీ దేవి 32వ ని.లో ఒక్కో గోల్ కొట్టారు. దీంతో ప్రథమార్థం ముగిసేసరికి భారత్ 2-0గోల్స్ ఆధిక్యలో నిలిచింది. 87వ ని.లో శిబానీ దేవి మరో గోల్ చేయడంతో భారత్ తిరుగులేని 3-0 ఆధిక్యతలోకి దూసుకెళ్లగా.. చైనీస్ తైపీ తరఫున ఏకైక గోల్‌ను కావోసిన్ ఇంజూరీ సమయం 93వ ని.లో చేసింది. భారత గోల్‌కీపర్ జోకిమ్ అలెగ్జాండర్సన్ ఈ మ్యాచ్‌లో అత్యద్భుత ప్రదర్శనను కనబర్చి చైనీస్ తైపీ ప్లేయర్లు కొట్టిన షాట్లను గోల్ కాకుండా నిలువరించి అందరి మన్ననలు పొందింది. ఈ గెలుపుతో ఎఎఫ్‌సి అండర్-20 మహిళల ఆసియాకప్ 2026 క్వార్టర్‌ఫైనల్ ఆశలను సజీవం చేసుకుంది. గ్రూప్-బిలో ఉజ్బెకిస్తాన్, జోర్డాల మధ్య జరిగే చివరి లీగ్ మ్యాచ్ డ్రా అయితే భారతజట్టు నాకౌట్‌కు చేరనుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఒక జట్టు గెలిస్తే మూడో స్థానంలో ఆ జట్టు ముందుకెళ్తుంది. 2004లో భారత మహిళలజట్టు చివరిసారిగా క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది.
నాకౌట్ ఆశలు సజీవం
- Advertisement -
- Advertisement -



