– పుస్తకమే శాశ్వత సంపద :సుధా బ్యాంకు ఎం.డీ, కవి, రచయిత పెద్దిరెడ్డి గణేశ్
– సూర్యాపేటలో నవతెలంగాణ బుకహేౌస్ ప్రారంభం
నవతెలంగాణ-సూర్యాపేట
అన్ని సంపదల కంటే విజ్ఞాన సంపద చాలా గొప్పనైనదని సుధా బ్యాంకు ఎం.డీ, కవి, రచయిత పెద్దిరెడ్డి గణేష్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ నూతన కాంప్లెక్స్ భవనంలో ఏర్పాటు చేసిన నవ తెలంగాణ బుకహేౌస్‌ను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. జ్ఞానం అనేది అన్ని సంపదలకంటే శ్రేష్టమని, అది ఎప్పటికీ మారిపోదని, ఏదో ఒక సందర్భంలో తప్పక ఉపయోగపడుతుందని చెప్పారు. పుస్తకాలు మనిషి పఠనాశక్తిని పెంపొందించడమే కాకుండా భావజాలాన్ని విశిష్టపరుస్తాయని తెలిపారు. విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఆలోచనల పరిధి విస్తరించి సమాజం మీద గొప్ప అవగాహన కలుగుతుందన్నారు. ఆర్థిక సంపద, భౌతిక వనరులు కాలక్రమంలో తగ్గిపోవచ్చని, విజ్ఞానం మాత్రం మెదడులో నిక్షిప్తమై ఉండి జీవితాంతం మనిషికి దోహదపడుతుందని వివరించారు.
నవతెలంగాణ ప్రచురణలు లాభాపేక్ష లేకుండా సమాజానికి ఉపయోగపడే పుస్తకాలను ప్రచురిస్తూ విజ్ఞాన భండాగారాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నాయని ప్రశంసించారు. సమాజంలో మార్పు తీసుకురావడమే కాకుండా చైతన్యం నింపే పుస్తకాలను ముంగిటకే తీసుకొస్తున్న ఈ సంస్థను ప్రజలు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. పుస్తకాలు కొనుగోలు చేసి చదివితే మేధోశక్తి పెరుగుతుందని, కొత్త దారులు దర్శనమిస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గణేష్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మాజీ జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ములకలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, అవాజ్ జిల్లా కార్యదర్శి జహంగీర్, నవతెలంగాణ రిపోర్టర్ జహంగీర్, ఏడివిటి ఇన్‌చార్జి వెంకట్‌రెడ్డి, మన తెలంగాణ జిల్లా రిపోర్టర్ వజ్జే వీరయ్య యాదవ్, సిరి వెన్నెల ఎడిటర్ కందుకూరి యాదగిరి, బుకహేౌస్ నిర్వాహకులు రఘు, చిన్నపంగి నరసయ్య, కక్కిరేణి చంద్రమోహన్, భార్గవి, అయినాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
విజ్ఞాన సంపదే గొప్పది.. పుస్తకాలే మార్గదర్శి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES