నిమ్స్ డైరెక్టర్ బీరప్ప
ఎమర్జెన్సీ భవనంలో వర్క్‌షాప్
నవ తెలంగాణ – బంజారాహిల్స్
న్యూరో-స్పైనల్ శస్త్రచికిత్స రంగంలో ఆధునిక సాంకేతిక పద్ధతులపై వైద్యులకు అవగాహన ఉండటం అత్యంత కీలకమని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప అన్నారు. నిమ్స్, అసోసియేషన్ ఫర్ న్యూరో-స్పైనల్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సంయుక్తంగా శనివారం హైదరాబాద్‌లోని నిమ్స్ ఎమర్జెన్సీ భవనంలోని ట్రామా ఆడిటోరియంలో ”యూనిలాటరల్ బయో పోర్టల్ స్పైనల్ ఎండోస్కోపీకోర్స్ -క్యాడేవరిక్ వర్క్‌షాప్ అండ్ సర్జికల్ ప్రిసెప్టర్‌షిప్” కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి నిమ్స్ సర్జన్ డాక్టర్ వంశీకృష్ణ అధ్యక్షత వహించగా డైరెక్టర్ బీరప్ప జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి ప్రసంగించారు. నేడు వైద్యరంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ముఖ్యంగా న్యూరో-స్పైనల్ సర్జరీలో నూతన సాంకేతి కతలను పరిచయం చేసి వైద్యులకు ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వడం అభినందనీయమని అన్నారు.
అసోసియేషన్ ప్రతినిధులు మాట్లా డుతూ.. ఆధునిక మినిమల్లి ఇన్వేసివ్ వెన్నెముక శస్త్రచికిత్సలో ఉపయోగించే బైపోర్టల్ టెక్నిక్ ద్వారా కేవలం రెండు చిన్న రంధ్రాల ద్వారా ఆపరేషన్ చేయడం వల్ల రోగులకు తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం ఉంటుందన్నారు. వేగంగా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. క్యాడేవరిక్ వర్క్‌షాప్‌లో వైద్యులు స్వయంగా మృతదేహాలపై ప్రాక్టికల్ శిక్షణ పొందినట్టు చెప్పారు. దీని ద్వారా వెన్నెముక నిర్మాణం, నరాల వ్యవస్థ, శస్త్రచికిత్స పద్ధతులపై లోతైన అవగాహన లభించినట్టు తెలిపారు. సర్జికల్ ప్రిసెప్టర్‌షిప్ సెషన్‌లో అనుభవజ్ఞులైన నిపుణు లు లైవ్ సర్జరీ ప్రదర్శనలు చేసి, పార్టిసిపెంట్లకు మార్గద ర్శకత్వం అందించారు. దీని ద్వారా వైద్యులు తాజా శస్త్రచికి త్స పద్ధతులను ప్రత్యక్షంగా నేర్చుకునే అవకాశం లభించిం ది. ఈ శిక్షణ కార్యక్రమం వైద్యుల నైపుణ్యాలను పెంపొం దించి, రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలందిం చడానికి దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో డా.సుచంద భట్టాచార్య, డా.వంశీకృష్ణ యెర్రమేని, డా. డి.రాజారెడ్డి, న్యూరో సర్జరీ వైద్యులు పాల్గొన్నారు.



