ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 6 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం
రెండు చోట్ల బీఆర్‌ఎస్ పాగా, మరో రెండు చోట్ల హంగ్
వికారాబాద్‌లో స్పీకర్ కూతురు అనన్య విజయం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో అధికార పార్టీ పైచేయి సాధించింది. ఇక్కడ 12 స్థానాలకు గాను కాంగ్రెస్ ఏకపక్షంగా 10 స్థానాలు గెలుచుకుంది. బీఆర్‌ఎస్, ఎంఐఎం చెరొకటి గెలిచాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఇక్కడ తన మార్క్‌ను చూపించారు. వికారాబాద్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తన సత్తా చాటారు. మున్సిపల్ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయన చైర్‌పర్సన్ అభ్యర్థిగా తన కూతురు అనన్యను 17వ వార్డు నుంచి పోటీలో నిలిపారు.
ఎన్నికల్లో ఆమె గెలవడంతో అనన్య చైర్‌పర్సన్ కానున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో 6, వికారాబాద్ జిల్లాలో 4 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. శంకర్‌పల్లి, చేవెళ్ల, షాద్‌నగర్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. వికారాబాద్ జిల్లాలో కొడంగల్, తాండూర్, వికారాబాద్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలుచుకుంది. ఇబ్రహీంపట్నం, ఆమనగల్ మున్సిపాలిటీలను బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. స్పష్టమైన మెజార్టీ సాధించింది. పరిగి, మొయినాబాద్‌లో హంగ్ ఏర్పడింది.
స్వతంత్రులు కీలకం..
మొయినాబాద్‌లో హంగ్ ఏర్పడింది. 26 స్థానాలకు కాంగ్రెస్ 10, బీఆర్‌ఎస్ 7 గెలిచాయి. ఇక్కడ ఐదుగురు స్వతంత్య్ర అభ్యర్థులు గెలిచారు. వీరు ఇక్కడ కీలకం కానున్నారు. పరిగిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చెరో 8 స్థానాలు గెలుచుకోగా.. రెండు స్థానాల్లో స్వతంత్రులు గెలిచారు. వీరిలో ఒకరు బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపారు. మున్సిపల్ పీఠం దక్కించుకోవడానికి ఈ రెండు పార్టీలు విశ్వప్రయత్నాలు చేశాయి.
కొడంగల్ ‘హస్త’గతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



