- Advertisement -
నవతెలంగాణ-కోహెడ
మండలంలోని తీగలకుంటపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు మీదుగా వర్షాలు, ఈదురు గాలులకు రోడ్డుపై నేలకొరిగిన భారీ వృక్షాన్ని కోహెడ కానిస్టేబుల్ వెంటనే స్పందించి జే సీ బీ సహాయంతో ఆపటికప్పుడే చెట్టును తొలగించారు. ఇదే రోడ్డు మీదుగా కరీంనగర్ జిల్లా కేంద్రానికి నిత్యం వాహనాల రాకపోకలు జరుగుతుంటాయి. బుధవారం కురిసిన వర్షాలకు భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో గమనించిన పోలీసులు వెంటనే తొలగించారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందే రోడ్డును గమనించి చెట్టును తొలగించిన భూక్య రమేష్, మిత్య, రమేష్ కానిస్టేబుల్ లను మండల ప్రజలు అభినందించారు.
- Advertisement -



