మోడ్రన్‌గా థియేటర్ ఆర్ట్ అని పిలుచుకునే రంగస్థలానికి, నాటకానికి ఆదరణ పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కళాసంస్థలు అద్భుతమైన ప్రయోగాలను చేస్తున్నాయి. ఆమేరకు విజయాలు సైతం సొంతం చేసుకుంటున్నాయి. నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని థియేటర్ ఆర్ట్ ఔత్సాహికులకు శిక్షణ అందించడంతో పాటు రంగస్థలం వేదికగా అద్భుతమైన నాటకాలకు ప్రాణం పోస్తూ కళా మూలాలతో ప్రయాణం చేస్తున్నారు. థియేటర్ ఆర్ట్‌ను నేటి తరం యువతకు, సినిమాకు వారధిగా నిలిచిన క్రియేటివ్ థియేటర్ ‘కోహినూర్ థియేటర్ కార్నివాల్’ పేరుతో అతి పెద్ద ఉత్సవాలకు (సెప్టెంబర్ 15,16,17) తెర తీస్తోంది.
1980ల వరకు యువతరం గ్రామాల్లో, పట్టణాల్లో పండగల సందర్భాల్లో నాటకాలను ప్రదర్శిస్తూ ఉండేవారు. పెద్ద రచయితలు నాటక సమాజాలకు అనువైన నాటకాలను అందిస్తూనే, వర్ధమాన సమాజాలను చైతన్యమైన నాటికలు, హాస్యనాటికలు ప్రత్యేకంగా రాసేవారు. పాఠశాలలు, కాలేజీల్లోనూ వీటిని విద్యార్థులు ప్రదర్శించేవారు. రానురాను ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. తెలుగు నాటకరంగం పరిషత్ పోటీలకే పరిమితమైందనేది కాదనలేని సత్యం. పరిషత్ పోటీల్లో ప్రసిద్ధి పొందిన నాటక సమాజాల ప్రదర్శనలకే అవకాశం దక్కుతోంది. అందులోనూ యువతకు సరైన అవకాశాలు ఉండటం లేదు. అందే సందర్భంతో నాటకోత్సవాలు/ నాటక పోటీలకు ప్రేక్షకాదరణ కొరవడుతోంది అనేది కూడా కాదనలేని నిజం. ఏ పోటీ ప్రదర్శనలను చూసినా, పెద్దలు మినహా యువత కనిపించని దుస్థితి. ఇలాగే కొనసాగితే తెలుగు నాటకం మసకబారే ప్రమాదముంది. దీనిని బద్దలు కొట్టింది నేటి యువత అన్నడానికి తెలంగాణ రాష్ట్రంలో యువత ప్రదర్శిస్తున్న నాటకాలకు దొరుకుతున్న ఆదరణే నిదర్శనం.
2025 సెప్టెంబర్ 15, 16 17 తేదీలలో రవీంద్రభారతి వేదిక క్రియేటివ్ థియేటర్, తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కతిక శాఖ, సంగీత నాటక అకాడమీ, డైస్ ఆర్ట్ ఫిలిమ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అతిపెద్ద నాటకోత్సవమే ‘కోహినూర్ థియేటర్ కార్నివాల్’. ఈ మూడు రోజుల నాటక మహోత్సవంలో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి, తెలంగాణ రంగస్థల సాంస్కతిక సంపదను ఒకే వేదికపైకి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశ్యం. అంతేకాకుండా తెలంగాణ జానపద కళలు, సంస్కతి, సంప్రదాయాలకు ఇందులో పెద్దపీఠ వేస్తున్నారు.
7 వైవిధ్యభరితమైన నాటక ప్రదర్శనలు వివిధ ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌లు తెలంగాణ జానపద కళా ప్రదర్శనలు
ఎగ్జిబిషన్లు, స్టాల్స్
17 రకాల వర్క్ షాప్…నటన టెక్నిక్, దర్శకత్వం, రైటింగ్, కలరి, మైమ్, బాడీ మూమెంట్, కర్ర సాము, డప్పు, లైటింగ్, డిజైనింగ్, స్టేజ్ క్రాఫ్ట్, స్పెషల్ ఎఫెక్ట్స్, ఆర్ట్ డైరెక్షన్, వాయిస్ అండ్ స్పీచ్, ఒక సెండ్ మ్యూజిక్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఆర్ట్ ఎగ్జిబిషన్స్, ఇలా మరెన్నో వర్క్ షాప్లు జరుగుతాయి. స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి, ఆర్ఫన్ హోమ్స్‌కి, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ వెహికల్ స్కూల్స్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల నుంచి నటనపై ఆసక్తి ఉన్న వారికి ఉచితంగా ఎంట్రీ ఉంటుంది.
7 వైవిధ్యభరితమైన నాటక ప్రదర్శనల సంక్షిప్త పరిచయం

దుస్రో నా కోయ్
ఈ నాటకం 16వ శతాబ్దపు కవయిత్రి మీరాబాయి, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుంది. కష్ణుడిపై ఆమె భక్తి ప్రేమను దాటి తిరుగుబాటుగా మారి, రాజవంశపు బంధనాల్నీ సామాజిక ఆంక్షలనూ చెరిపేసింది. పాటలు, నత్యాలు, కవితల ద్వారా ఆమె విశ్వాసం అచంచలంగా నిలిచి, త్యాగంతో విముక్తి పొందిన ఆధ్యాత్మిక శక్తివంతమైన నాటకం. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి కన్హియా లాల్ కైత్వాస్ రచనా దర్శకత్వంలో రంగ విధౌషక్ నిర్మాణంలో ప్రదర్శించబడుతుంది.

అల్ఫీ 12 మిస్సింగ్
అల్ఫీ 12 ఏళ్ళ పేదరికంలో పెరిగిన బాలుడు. మెరిట్ స్టూడెంట్ అయినప్పటికీ అతనిపై నిందలు పడుతూనే ఉంటాయి. ఒక రోజు కోపంతో మార్క్స్ రిపోర్ట్ కార్డ్ చింపేసి ఇంటి నుంచి పారిపోతాడు. ఎవరికీ తెలియని ‘జాగ్లోఫానియా’ అనే అద్భుత గ్రహానికి చేరుకుంటాడు. అతని జీవితం మలుపు తిరుగుతుంది. అల్ఫీ ఈ ప్రయాణం ద్వారా జీవితవిలువలు, లక్ష్యాలు తెలుసుకుంటాడు. కేరళ రాష్ట్రం నుంచి రంగప్రభాత్ నిర్మాణంలో అభిషేక్ రంగప్రభాత్ దర్శకత్వంలో పిల్లల నాటక ప్రదర్శన ఉంటుంది.

సాలుమరగాల తాయి తిమ్మక్క
సాలుమరగాల తిమ్మక్క జీవితాన్ని ఆధారంగా తీసుకున్న ఈ నాటకం ఆమె బాల్యం, కుటుంబం, పోరాటం, పర్యావరణం పట్ల ఆమె ప్రేమను హద్యంగా చూపిస్తుంది. తిమ్మక్క చిగురించిన చెట్లను ఆమె పిల్లలుగా మారతాయి. ఈ నాటకం చెట్లు మన జీవితానికి ఎలా అవసరమో, వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిది అనే సందేశం అందిస్తుంది. డా. బేళూర్ రఘునందన్ ఈ నాటకాన్ని రచించి, రూపొందించారు. కర్ణాటక రాష్ట్రం నుంచి ఖాజాన సంస్థ ఆధ్వర్యంలో సాలుమరగాల తాయి తిమ్మక్క నాటక ప్రదర్శిన జరగనుంది.
భరతముని ‘నాట్యశాస్త్ర’
ఇది హైదారాబాదులోని నిషుంజిత స్కూల్ ఆఫ్ డ్రామా ప్రదర్శిస్తున్న భరతముని రచించిన ‘నాట్యశాస్త్ర’. ఈ నాటకం భారతీయ నాటక కళ, నత్యం, సంగీతం, ఇతర కళారూపాల సమగ్ర గ్రంథం. నాట్యశాస్త్రం ఆధారంగా రూపుదిద్దుకుంది. వేదాల సారాంశంగా భావించబడే ఈ గ్రంథాన్ని ‘పంచమ వేదం’ అని కూడా అంటారు. పి.ఎస్.ఆర్. అప్పారావు మోనోగ్రాఫ్ ఆధారంగా నాట్యశాస్త్రంలోని సూత్రాలను సరళంగా నాటకరూపంలో ప్రజలకు పరిచయం చేసే డాక్యుమెంటరీ నాటకం.

రుక్మిణీ
భారతీయ నాట్యకళలను పునరుద్ధరించి, ప్రపంచానికి పరిచయం చేసిన రుక్మిణి దువి అరుణ్డేల్ జీవితం ఆధారంగా ఈ నాటకం రూపొందించబడింది. లైవ్ సంగీతం, ప్రత్యక్ష చిత్రకళ, నత్యం, నాటక మేళవింపుతో ఆమె ఆధ్యాత్మికత, కళాత్మక దష్టి, సాంస్కతిక విప్లవం వేదికపై సజీవంగా ఆవిష్కతమవుతుంది. ఆమె జీవన ప్రయాణం – చిన్ననాటి స్ఫూర్తి నుంచి కళకు అంకితమవడం వరకు శ్రీజక్ ఛటర్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ నాటకం ప్రేక్షకుల్లో స్ఫూర్తిని రేకెత్తించేలా, భారతీయ సంస్కతిని నిలబెట్టే గాథగా నిలుస్తుంది.
సల్మా దీవానీ
భాగ్యశ్రీ టేక్ దర్శకత్వంలో వచ్చిన ఈ నాటకం ఒక రోజు సందర్భంగా సాగే ఈ నాటకం సల్మా జీవితాన్ని సరదాగా, వ్యంగ్యంగా చూపిస్తుంది. భర్త గల్ఫ్ లో ఉండటంతో వచ్చే ఒంటరితనం, గహజీవితం విసుగు, బాలావుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పై ఆమె పిచ్చి అభిమానం ఈ కథకు హాస్యరసాన్ని నింపుతాయి. అయితే లోతులతో ఇది బాధలను, ఒంటరితనం, అంధాభిమానాలుపై ఒక సామాజిక వ్యాఖ్యగా ఈ నాటకం నిలుస్తుంది.

రామేశ్వరం కాకులు
పతాంజలి శాస్త్రీ రాసిన చిన్న కథ జాన్ బషీర్ దర్శకత్వంలో బి స్టూడియో నుంచి నాటకం మరణజ్ఞానం అనే లోతైన అంశాన్ని పరిశీలిస్తుంది. కథానాయిక పద్మ ఒక వేశ్య. ఆమె జీవితం, జ్ఞాపకాలు, పోరాటాలు, అంతర్మథనాలు, తన జీవితపు గాయాలు, మిగిలిన ఆశలు, దరిచేరే మరణ సత్యం మధ్య పద్మ ఎదుర్కొనే భావోద్వేగ యాత్ర ఇది. అర్థం, గౌరవం, విముక్తి కోసం చేసిన శోధనగా ఈ నాటకం ఆవిష్కతమవుతుంది.
అనంతోజు మోహన్‌కృష్ణ
88977 65417