నవతెలంగాణ – మిర్యాలగూడ
అడవి బిడ్డల హక్కుల కోసం పోరాడిన యోధుడు కొమరం భీం అని బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్, బిసి జేఏసీ కో కన్వీనర్ చేగొండి మురళీ యాదవ్ లు అన్నారు. కొమరం భీమ్ 124వ జయంతి సందర్భంగా మిర్యాలగూడలోని మెరెడ్డి రాంచంద్రరెడ్డి గ్రంథాలయంలో ఆయన చిత్రపటానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు.గిరిజన బిడ్డల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన పోరాట యోధుడు కొమరం భీం అని చెప్పారు. నిజాం నవాబుల పాలనలో రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన నాయకుడు కొమరం భీమ్ అని చెప్పారు.జల్ జంగల్, జమీన్ నినాదం ఇచ్చి అడవి బిడ్డలకు ఐక్యం హాక్కులను సాధించారని పేర్కొన్నారు. బానిస సంకెళ్లను తెంచడం కోసం ఉద్యమించి జీవితాన్ని త్యాగం చేసిన వీర తెలంగాణా యోధుడని కొనియాడారు. కార్యక్రమంలో కుమ్మరికుంట్ల సుధాకర్,,రమేష్,మధు,బాలరాజు, పండు,సురేష్,సత్యనారాయణ,సీతారాం, సైద తదితరులు పాల్గొన్నారు.
అడవి బిడ్డల హక్కుల కోసం పోరాడిన యోధుడు కొమరం భీం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES