Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొమరం భీమ్ స్ఫూర్తితో ఉద్యమించాలి

కొమరం భీమ్ స్ఫూర్తితో ఉద్యమించాలి

- Advertisement -

టిఏజీఎస్ జిల్లా కార్యదర్శి గొంది రాజేష్
నవతెలంగాణ – గోవిందరావుపేట 

కొమరం భీమ్ స్ఫూర్తితో ఉద్యమించాలని టి ఏ జి ఎస్ జిల్లా కార్యదర్శి గొంది రాజేష్ అన్నారు. బుధవారం మండలం పసర  గ్రామంలో కొమురం భీం జయంతి సందర్భంగా కొమురం భీం చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళాలు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి గొంది రాజేష్  మాట్లాడుతూ నిజాం నవాబ్ కి వ్యతిరేకంగా అడవి బిడ్డల హక్కుల కోసం మిలిటెంట్ పోరాటాలు చేసి నిజాం నవాబ్ నీ ఎదిరించిన ఘనత కొమరం భీం ది అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జల్,జంగిల్, జమీన్ హమారా హై అనే నినాదాన్ని సృష్టించిన ఘనత ఆయనకే దక్కుతుంది అని అన్నారు.

నిజం నవాబ్ భూ  ఆక్రమణలకు మరియు దోపిడీకి వ్యతిరేకంగా ఆదివాసీ ప్రజానీకాన్నీ చైతన్య పరిచి దళాలుగా ఏర్పాటు చేసి నిజాం పై వీరోచిత పోరాటాలు చేసి ఆదివాసీ జాతి కోసం  కోసం పోరాడారని అన్నారు, భవిష్యత్తులో కొమరం భీమ్ స్ఫూర్తితో  ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి కోసం ఆదివాసి ప్రజలంతా ఉద్యమించాల్సిన అవసరముందని ఆయన అన్నారు. కొమరం భీమ్ పోరాట మరియు ప్రాణత్యాగ  ఫలితమే ఈరోజు ఆదివాసీలు అనుభవిస్తున్న రాజ్యాంగ హక్కులు మరియు ఫలాలు అని కొనియాడారు. కొమరం భీమ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంగా ఉండి అయన ఆశయ సాధన కోసం కలిసి పోరాడటమే మనం ఆయనకు ఇచ్చే అసలైన నివాళులు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు దుగ్గి చిరంజీవి, ఉపాధ్యక్షులు తోలేం కిష్టయ్య, పూనెం నాగేష్, ఊకె ప్రభాకర్, సహాయ కార్యదర్శులు కుర్సం చిరంజీవి, కోరం చిరంజీవి, అల్లెం అశోక్ మడకం సత్యనారాయణ ఇంకా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -