Friday, March 27, 2026
E-PAPER
Homeజిల్లాలుచౌటుప్పల్ శ్రీరామనవమి వేడుకలలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు

చౌటుప్పల్ శ్రీరామనవమి వేడుకలలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు

- Advertisement -


నవతెలంగాణ -చౌటుప్పల్ రూరల్:

చౌటుప్పల్ పట్టణంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో జరిగిన ఈ వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా సాగాయి. ఈ కార్యక్రమానికి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మిరాజగోపాల్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. వారు శ్రీ సీతారామచంద్ర స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకలకు హాజరైన దంపతులకు మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు, శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకల నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించారు.

తరువాత చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో కూడా ఎమ్మెల్యే దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య ఆలయ కమిటీ చైర్మన్ బొబ్బిల మురళి మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ వార్డు కౌన్సిలర్లు సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -