Tuesday, October 7, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఎడ్ బిడ్ లో ఘనంగా కొమురం భీం వర్ధంతి..

ఎడ్ బిడ్ లో ఘనంగా కొమురం భీం వర్ధంతి..

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్ 
మండలంలోని ఎడ్ బిడ్ గ్రామంలో మంగళ వారం నాయక్ పోడ్ సంఘం ఆధ్వర్యంలో కొమురం భీమ్ 85 వ వర్ధంతిని వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకుని ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. నిజాం పాలనకు వ్యతిరేకంగా జల్ జమీన్ జంగిల్ నినాదంతో కొమురం భీం ఆదివాసీల తరపున అలుపెరగని పోరాటం చేశారని అన్నారు. ఆదివాసీలకు ఆనాడే పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని కోరారని, ఆదివాసీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ ఆనాడు నిజాం పాలనకు వ్యతిరేకంగా విరచిత పోరాటాన్ని కొమురం భీం చేశారాణి తెలిపారు. నాయకులు మాజీ సర్పంచ్ నిమ్మ పోతన్న,దత్తత్రి, భూమన్న రాం చందర్ రెడ్డి,ఉదయ్,సాయినాథ్, అశోక్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -