నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని వి. సంధ్య రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.మదుపాల్ తెలిపారు. ఈనెల 17వ తేదీన నిజామాబాద్ జిల్లాలోని తిర్నపల్లి గ్రామం జరిగిన నెట్ బాల్ క్రీడ ఎంపిక పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన సంధ్య రాష్ట్రస్థాయికి నెట్ బాల్ క్రీడా పోటీలకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు.ఈనెల సెప్టెంబర్ 21,22,23 తేదీలలో నల్గొండలో జరిగే రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీల్లో పాల్గొంటుందని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బి.రమేష్ గౌడ్ తెలిపారు.
ఈ మేరకు శనివారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో నెట్ బాల రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థిని సంధ్య ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి మధుపాల్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మెల్ల గంగాధర్ సభ్యులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు అందించి జ్ఞాపికను అందజేశారు.రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచడం ద్వారా పాఠశాలకు, గ్రామానికి, ఉపాధ్యాయులకు అందరికీ పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.