Monday, January 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కోనాపూర్ పంచాయతీ పాలకవర్గం సమావేశం

కోనాపూర్ పంచాయతీ పాలకవర్గం సమావేశం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని కోనాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం సర్పంచ్ రిక్కల అరుణ్ రెడ్డి అధ్యక్షతన గ్రామ పంచాయతీ  పాలకవర్గం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా  గ్రామంలోని ప్రధాన సమస్యలపై చర్చించారు. వార్డు సభ్యులు తమ తమ కాలనీల్లో నెలకొన్న సమస్యలను సమావేశంలో ప్రస్తావించారు. గ్రామ పంచాయతీకి నిధులు సమకూరిన వెంటనే ప్రాధాన్యత క్రమంలో గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో ఉపసర్పంచ్ మోర్తాడు ఉదయ్, పంచాయతీ కార్యదర్శి నవీన్, వార్డు సభ్యులు జాల రాజు, శనిగారపు వనజ, పాలేపు రమేష్, గంగుల నందన్, ముసుకు సంతోష్ రెడ్డి, లావణ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -