బిసిటియు జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్
నవతెలంగాణ – కంఠేశ్వర్
కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరానికి ఆదర్శమని బిసిటియు జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ అన్నారు. ఈ మేరకు కొండా లక్ష్మణ్ బాపూజీ 110 వ జయంతి సందర్భంగా బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ లో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన తెలంగాణ జాతిపిత అని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు నేటి యువత కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్షి రాఘవాపురం గోపాలకృష్ణ, అసోసియేటడ్ అధ్యక్షులు ఎ మోహన్, ఉపాధ్యక్షులు యు. విజయ్ కుమార్, కోశాధికారి డి రాజు, బిసిటియు నాయకులు దేవదాసు, సుమన్, వరప్రసాద్ మరియు కాంగ్రెస్ నాయకులు రాజ నరేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరానికి ఆదర్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES