నవతెలంగాణ – కంఠేశ్వర్ : కొండా లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. పట్టణ పద్మశాలి సంఘం సంఘానికి ఈ నెల 25న పద్మశాలి ఉన్నత పాఠశాలలో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలు నేటి నుంచి ఈ నెల 11 వరకు వేయనున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ప్యానెల్ లో అధ్యక్షులుగా పెంటమ్ దత్తాద్రి, ప్రధాన కార్యదర్శిగా చోటి భూమేష్, ఉపాధ్యక్షులుగా భీమర్తి రవి, కన్నా దుబ్బ రాజం, బాగుల శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా బీ.జి. ప్రసాద్, భూస రవి, ఎనుగందుల సుభాష్, కోశాధికారి గా మోర సాయిలు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కస్తూరి గంగరాజు, ప్రచార కార్యదర్శి గా బూస శ్రీనివాస్ లు మార్కండేయ మందిరంలో నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా నాయకులు ఎస్సార్ సత్యపాల్, అమృతపురం గంగాధర్, బిల్ల మహేష్, మదన్మోహన్, సిలివేరి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల అధికారిగా అడ్వకేట్ గంగా ప్రసాద్ ను నియమించారు.
నామినేషన్లు దాఖలు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ప్యానెల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES