ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు
నవతెలంగాణ – పాలకుర్తి
స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ని తెలంగాణ జాతిపితగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని పద్మశాలి సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పెనుగొండ రమేష్ ప్రభుత్వాన్ని కోరారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని ఆదివారం మండల కేంద్రంలో గల రాజీవ్ చౌరస్తాలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ అధ్యక్షులు డాక్టర్ మేడారపు సుధాకర్, పోపా జిల్లా సహాయ కార్యదర్శి చిదురాల ఎల్లయ్య ల తో కలిసి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం తెలంగాణకు అంకితమయ్యిందని తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా పాఠ్యపుస్తకాలలో పొందుపరచాలని, ఆయన చేసిన సేవలు, త్యాగాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను ప్రభుత్వం ముద్రించి సమాజానికి అందించినప్పుడే కొండా లక్ష్మణ్ బాపూజీకి నిజమైన నివాళి అని అన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమం సందర్భంగా మంత్రి పదవిని కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగం చేశాడని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాలకుర్తి పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు చిలుక మారి వెంకటేశ్వర్లు, విగ్రహ కమిటీ సలహాదారు కాటబత్తిని రమేష్, పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి చిదురాల మార్కండేయ, విగ్రహ కమిటీ గౌరవ అధ్యక్షుడు పెనుగొండ వెంకటేశ్వర్లు, విగ్రహ కమిటీ కోశాధికారి చిలుకమారి సోమేశ్వర్, కాటబత్తిని సోమేశ్వర్, చిలుకమారి ఉప్పలయ్య, చిదురాల నాగన్న, వైట్ల పుండరీకుడు, పొన్నాల వీరయ్య, చిలుకమారి శ్రీధర్, ఈగ శ్రీను, కూరపాటి రాజు, జిల్లా ప్రకాష్, ఎనగందుల శ్రీనివాస్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.