నవతెలంగాణ – జన్నారం
కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి సందర్భంగా జన్నారం మండల కేంద్రంలో శనివారం మండల బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ ఉద్యమ పోరాట సంఘం మంచిర్యాల జిల్లా కన్వీనర్ ఆడెపు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ సాధన ఉద్యమ నాయకుడు, స్వాతంత్ర సమర యోధులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీ సీ ప్రముఖ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు. జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి తరం బీసీ కులాల వారు అడుగులు వేయవలసిన అవసరం ఉన్నదని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరి చంద్రయ్య, కో కన్వీనర్ కడార్ల నరసయ్య, బీసీఐఎఫ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చీఫ్ కో ఆర్డినేటర్ శ్రీరాముల కొండయ్య మంచిర్యాల జిల్లా కో కన్వీనర్ బాలసాని శ్రీనివాస్ గౌడ్ మహేంద్ర సంఘం నాయకుడు కోడి జుట్టు రాజయ్య, ఒడ్డెర సంఘం జన్నారం మండల అధ్యక్షుడు కుంట మహేష్ , మున్నూరు కాపు సంఘం పొనకల్ పట్టణ ఉపాధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, ఖానాపూర్ నియోజకవర్గ కో కన్వీనర్ ఆండ్ర పురుషోత్తం జన్నారం మండల పూసల సంఘం మాజీ అధ్యక్షుడు గుడ్ల రాజన్న తదితరులు పాల్గొన్నారు.