Sunday, September 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి 

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి 

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమకారులు, పద్మశాలి ముద్దుబిడ్డ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి వేడుకలు ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గారేపల్లి కూడలి లో గల ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి నిలువెత్తు పూలమాలలతో అలంకరణలు చేసి, అంగరంగ వైభవంగా నివాళులు అర్పించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు.

 ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కాటారం మండల పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు దోమల సమ్మయ్య మాట్లాడుతూ…పద్మశాలి ముద్దుబిడ్డ, తెలంగాణ జాతిపితగా ఖ్యాతికెక్కిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను కొనియాడారు. ఈనెల 27న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో, గారేపల్లిలో జరిగే కార్యక్రమానికి పద్మశాలీయులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి నాయకులు పులి అశోక్, కొండ వెంకటేశ్వర్లు, మాచర్ల రాజేందర్, వలస వెంకటేశ్వర్లు, గాదె రమేష్, దాసరి గట్టయ్య, పల్నాటి బలరాం, అమృతం సంతోష్, దోమల రాజశేఖర్, కనుకుట్ల శ్రీనివాస్, దోమల సురేష్, ఎలుగం రాజనారాయణ, కనుకుట్ల శ్రీను, ఎలుగం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -