Sunday, July 13, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకోట శ్రీనివాసరావు చిర‌స్మ‌ర‌ణీయ సినీ పాత్ర‌లు

కోట శ్రీనివాసరావు చిర‌స్మ‌ర‌ణీయ సినీ పాత్ర‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమ‌లో త‌న న‌టన‌తో చెర‌గ‌ని ముద్ర వేశారు కోట శ్రీ‌నివాస‌రావు. అనేక సినిమాలో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో తండ్రిగా, తాతగా, రాజకీయ నాయకుడిగా న‌టించి తెలుగు ప్ర‌జ‌ల‌ను న‌వ్వించారు. విభిన్న‌మైన స‌వాళ్ల‌తో కూడిన పాత్ర‌ల్లో త‌న శైలిలో న‌టించారు. దాదాపు 750కి పైగా చిత్రాలో నటించి మెప్పించారు.

‘ప్రతిఘటన’ విజయశాంతి, చరణ్‌రాజ్‌లతో పాటు కోట శ్రీనివాసరావు జీవితంలోనూ ప్రత్యేక సినిమాగా నిలిచిపోయింది. ‘నమస్తే తమ్మీ…’ అంటూ తెలంగాణ యాసతో మినిస్టర్‌ కాశయ్యగా అదరగొట్టారాయన. ‘అహ నా పెళ్లంట’ పిసినారి లక్ష్మీపతిగా కోట నటనను ఒక్క మాటలో వర్ణించలేం.

కోటశ్రీనివాసరావు, బాబు మోహన్‌లది సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌ అనేది తెలిసిందే. వీళ్లు ఇద్దరూ ఉంటే చాలు సినిమా సగం సక్సెస్‌ అయినట్టే అనేంతగా ఈ జోడి హిట్టయింది. ముత్యాల సుబ్బయ్య తీసిన ‘మామగారు’లో ఈ జంట చేసిన కామెడీకి పొట్టచెక్కలయ్యేలా నవ్వారు తెలుగు ప్రేక్షకులు. ఈ చిత్రం విజయం సాధించడంలో వీళ్లిద్దరి కామెడీ కీలక భూమిక పోషించింది. పోతురాజుగా కోట శ్రీనివాసరావు నటన సినిమాకే హైలైట్‌. ఆ తర్వాత ‘ఏవండీ ఆవిడొచ్చింది’, ‘చిన రాయుడు’, ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ ఇలా దాదాపు 50 సినిమాలకు పైగా వీరిద్దరూ

తెలుగులో దాదాపు 750 చిత్రాలకు పైగా వరకు నటించి తెలుగు నాట చెరిగిపోని ముద్ర వేశారు కోట. ఇతర భాషల్లోనూ నటించి అక్కడా తన ప్రతిభను చాటుకున్నారు. తమిళం, కన్నడం, హిందీ, మలయాళం సినిమాల్లో నటించారాయన. ‘సామి’ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన అక్కడ దాదాపు సుమారు 30 చిత్రాల్లో చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -