- Advertisement -
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో కొటాక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభాలు 7 శాతం తగ్గి రూ.3,282 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.3,520 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇదే సమయంలో రూ.6,842 కోట్లుగా నికర వడ్డీ ఆదాయం.. గడిచిన క్యూ1లో 6 శాతం పెరిగి రూ.7,259 కోట్లుగా చోటు చేసుకుంది. జూన్ 30 నాటికి బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 1.48 శాతంగా, నికర ఎన్‌పీఏలు 0.34 శాతంగా నమోదయ్యాయి.
- Advertisement -