Monday, May 5, 2025
Homeతెలంగాణ రౌండప్కొటార్మూర్ వీడీసీ ఎవరిని బహిష్కరించలేదు..

కొటార్మూర్ వీడీసీ ఎవరిని బహిష్కరించలేదు..

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ : మున్సిపల్ పరిధిలోని కొటార్మూర్ విడిసి గంగాపుత్రులను బహిష్కరించడం ఆవాస్తవమని, వారంతట వారే దూరంగా ఉంటున్నారని వీడిసి అధ్యక్షులు డిష్ గంగాధర్ , క్యాషియర్ మామిడ ఎలియా రెడ్డిలు శనివారం తెలిపారు. వీడిసి ఎవరిని బహిష్కరించలేదని , మా మధ్య చిచ్చు పెట్టడానికి కొందరు చేస్తున్న దుష్ప్రచారం అని, ఇది పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు. గంగపుత్ర సంఘం వారు వారంతట వారే దూరంగా ఉన్నారని, జిల్లాలో జరుగుతున్న వీడీసీల దుశ్చర్యలకు పూర్తిగా వ్యతిరేకమని అన్నారు. మున్సిపల్ పరిధిలోని ఆరవ వార్డు పరిధిలో  భూ కబ్జా ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, సర్వేనెంబర్2 27 లో ఉన్న తొమ్మిదిన్నర గుంటల భూమిపై వస్తున్న ఆరోపణలు అవాస్తమని అన్నారు. గంగపుత్ర సంఘ సభ్యులు నరేష్, దయాకర్, పోశెట్టి, బాలు, నరసయ్య, తదితరులు మాట్లాడుతూ మమ్మల్ని ఎవ్వరూ బహిష్కరించలేదని, కొందరు దురుద్దేశంతో చేస్తున్న ప్రచారం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీధర్ గౌడ్ ,సభ్యులు అచ్యుత్,పెద్ద నారాయణ,గైనీ గంగాధర్,లింబాగౌడ్,నాగ రాములు,శేఖర్,శ్రీకాంత్,నర్సయ్య,ప్రశాంత్,బాలకృష్ణ గ్రామ సభ్యులు ఇట్టేడి గంగారెడ్డి ,మహేందర్ గౌడ్,జగదీశ్,గంగాధర్ గౌడ్,సోముల రాజేశ్వర్,తలారి శ్రీకాంత్,కొప్పుల గంగారాం,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -