Monday, February 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొత్తచెరువు తండా పంచాయితీ గ్రామసభ

కొత్తచెరువు తండా పంచాయితీ గ్రామసభ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని కొత్తచెరువు తండా గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సోమవారం సర్పంచ్ లకావత్ సంతోష్ అధ్యక్షతన గ్రామ సభను నిర్వహించారు. గ్రామ సభలో పంచాయతీ కార్యదర్శి నవీన్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆదాయ వ్యాయాలను చదివి వినిపించారు. ఇటీవల మరమ్మత్తులు చేయించిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వివరాలను సభలో వెల్లడించారు. అనంతరం గ్రామంలో నెలకొన్న పలు సమస్యలపై చర్చించారు.

గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న విద్యుత్ స్తంభాలను తొలగించి నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని, అవసరం ఉన్నచోట నూతనంగా మురికి కాలువలను నిర్మించాలని గ్రామసభలో తీర్మానించారు. ఇతరత్రా సమస్యలను పంచాయతీకి సమకూరే ఆదాయాన్ని బట్టి పనులు సాగించాలని నిర్ణయించారు.ఈ గ్రామ సభలో ఉపసర్పంచ్ గుగులోతు రమేష్, వార్డు సభ్యులు అపవత్ రాజేందర్, లకావత్ రవీందర్, భూక్య సునీత, భూక్య కౌసల్య, భూక్య గోవింద్, లకాపతి మమత, గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -