- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
రోడ్డు రవాణా భద్రత వారోత్సవాల్లో భాగంగా భూపాలపల్లి జిల్లా ఎస్పీ సంకీర్త్ ఆదేశాల మేరకు కొయ్యుర్ ఎస్ఐ-2 రాజన్ కుమార్ ఆధ్వర్యంలో మల్లారం గ్రామంలో రోడ్డు బద్రతపై, హెల్మెట్ ప్రయోజనాలపై అవగాహన నిర్వహించారు. ముఖ్యంగా యువత ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని సూచించారు. మైనర్ లు డ్రైవింగ్ చేయరాదని, చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ద్విచక్రవాహనంపై వచ్చేవారికి హెల్మెట్ ధరించి వస్తేనే పెట్రోల్ బంకు యజమానులు పెట్రోలు పోయాలని సూచించారు.
- Advertisement -



