- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని నారాయణ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించామని నారాయణ పాఠశాల ఎంజీఎం శివాజీ అన్నారు. కృష్ణాష్టమి పండుగ సందర్భంగా పాఠశాల విద్యార్థులను రాధాకృష్ణ వేషధారణలో ముస్తాబు చేసి, విద్యార్థులకు పండగ విశేషాలు ఉట్టి కొట్టి ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాఠశాల ప్రిన్సిపల్ కిషోర్, కోఆర్డినేటర్ రాకేష్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రవితేజా, మనిష తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -