Friday, September 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు 

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట 
మండల వ్యాప్తంగా శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుండి సమీపంలోని దేవాలయాలకు ప్రత్యేక పూజలు కొరకు భక్తుల తరలి వెళ్లారు. పలువురు వాకిళ్లలో ముంగిళ్ళలో కృష్ణుడు ఇంట్లోకి వస్తున్నట్టుగా పాదాలను వేసి పూజలు నిర్వహించారు. మరికొందరు తమ పుత్రికలను గోపికలు గా చిన్న కుమారులను శ్రీకృష్ణుని వేషధారణలో తరించారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో స్తంభం ఎక్కే ఆటను యువత అధిక సంఖ్యలో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. అదేవిధంగా గ్రామాలలో సాయంత్రం వేళ యువత ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. పోటీలు పడి ఉట్టి కొట్టి బహుమతులు గెలుచుకున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -