- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
మండల కేంద్రంలోని శాంభవి హై స్కూల్ లో కృష్ణాష్టమి పురస్కరించుకొని వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికలు వేషధారణతో అలరించారు. శ్రీకృష్ణుడు వేషధారణతో ఉట్టి కొట్టే కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు . ఈ కార్యక్రమంలో చైర్మన్ మధుసూదన్ రాజు, కరస్పాండెంట్ రవీన్ ప్రసాద్, ప్రిన్సిపాల్ ఇంద్రాణి, వైస్ ప్రిన్సిపాల్ మంజుల, ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -