Friday, February 27, 2026
E-PAPER
Homeకరీంనగర్సీఎం కప్ కిక్ బాక్సింగ్‌లో కృష్ణవేణి విద్యార్థుల సత్తా

సీఎం కప్ కిక్ బాక్సింగ్‌లో కృష్ణవేణి విద్యార్థుల సత్తా

- Advertisement -
  • పొడకంటి కృష్ణకు గోల్డ్,ఆర్ అక్షయ్‌కు సిల్వర్ 
    – ఎమ్మెల్యే అభినందనలు
  • నవతెలంగాణ-రాయికల్
  • పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు సీఎం కప్ కిక్ బాక్సింగ్ పోటీల్లో ప్రతిభ చాటారు. రాష్ట్రస్థాయిలో పొడకంటి కృష్ణ గోల్డ్ మెడల్ సాధించగా,ఆర్.అక్షయ్ సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. అలాగే జి.మనోజ్, ఆర్.మనీంద్ర జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తన క్యాంప్ కార్యాలయంలో విద్యార్థులను అభినందించారు.
  • క్రీడల్లో క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మెరిసి పతకాలు సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థులను మరింతగా ప్రోత్సహించి జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించేలా శిక్షణ అందించాలని కోచ్‌లకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మోర సుమన్,పాఠశాల ప్రిన్సిపాల్ జె.వేణుగోపాలరావు,జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ రవికుమార్,కోచ్‌లు రామానుజన్,సంతోష్ పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -