Friday, February 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్రితిక హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ నరసింహ గౌడ్ కు ఘన సన్మానం

క్రితిక హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ నరసింహ గౌడ్ కు ఘన సన్మానం

- Advertisement -

విజయాన్ని చేరుకునేందుకు క్రీడాకారులు పట్టుదలతో కృషి చేయాలి..
క్రీడాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాను..
క్రితిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మొగుదాల నరసింహ గౌడ్ సరిత..
నవతెలంగాణ – మునుగోడు

మునుగోడు మండలంలోని కొంపల్లి గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 15,16 తేదీలో కబడ్డీ పోటీలకు సహకరించిన క్రితిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మొగుదాల నరసింహ గౌడ్ సరిత దంపతులకు గురువారం రాత్రి  కొంపల్లి గ్రామ యువకులు ఆలయ కమిటీ చైర్మన్ వెదిరే విజేందర్ రెడ్డి, ఎన్.ఆర్.ఐ బొబ్బల వెంకట్ రాంరెడ్డి ,మునుగోడు ఎస్సై ఇరుగు రవి తో కలిసి గజమాలతో ఘనంగా సన్మానం చేశారు. 

కబడ్డీ పోటీలలో  మొదటి బహుమతి గా గెలుపొందిన కుదక్షపెల్లి టీం కు రూ.30వేలు, రెండవ బహుమతి గా గెలుపొందిన కొంపల్లి యువసేన టీం కు 15 వేలు , మూడో బహుమతి గా గెలుపొందిన  స్పాయి టీం కు 7 వేలు తోపాటు షీల్డ్ ను అందజేశారు. ఈ సందర్భంగా నరసింహ గౌడ్ మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం లోని అంగరంగ వైభవంగా నిర్వహించే కొంపెల్లి శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల కు సేవ చేసేందుకు తమకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు . తమకు చిన్నప్పటినుండే క్రీడలు అంటే చాలా ఇష్టమని తెలిపారు. క్రీడాకారులు పట్టుదలతో పెట్టుకున్న లక్ష్యాన్ని చేరేందుకు కష్టపడితే మంచి ఫలితాలు సాధించగలుగుతారని తెలిపారు. క్రీడాకారులకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జీడిమడ్ల నిర్మల దశరథ , మాజీ సర్పంచ్ జాల వెంకన్న యాదవ్ , గ్రామ ప్రజలు మక్కెన అప్పారావు , క్రితిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్  మార్కెటింగ్ మేనేజర్ మోగదాల శంభు, వడ్డేపల్లి దుర్గాప్రసాద్, సూర శ్రీశైలం, వడ్డేపల్లి శంకర్, సిహెచ్ శంకర్, స్వామి, సుర రమేష్, మహేష్, వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -