- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో శనివారం నుంచి ప్రారంభం కాబోతున్న పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థినీ విద్యార్థులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పరీక్షల్లో ప్రతీ విద్యార్థి మంచి ప్రతిభను కనబర్చి, విజయం సాధిస్తారని శుక్రవారం ఒక ప్రకటనలో ఆశించారు. జీవితంలో మొదటి పబ్లిక్ పరీక్ష రాస్తున్నందున ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కోరారు.
- Advertisement -



