Saturday, October 11, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో ఉత్పత్తిపై కేటీఆర్ హర్షం

కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో ఉత్పత్తిపై కేటీఆర్ హర్షం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: వరంగల్‍లోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో ఉత్పత్తిపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మొదటి యూనిట్ ఉత్పత్తి ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. వరంగల్ సమీపంలోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ లో తమ తొలిదశ ఉత్పత్తిని తాజాగా ప్రారంభించింది. ఈ మేరకు శనివారం ఎక్స్ లో కేటీఆర్ స్పందించారు. ఈ మెగా టెక్స్ టైల్ తెలంగాణకు గర్వకారణం అని ఇక్కడి నుంచి ప్రపంచ మార్కెట్లకు టీషర్టులు ఎగుమతి చేయడం సంతోషంగా ఉందన్నారు. 2023లో కాకతీయ టెక్స్ టైల్ పార్కులో 11 యంగ్ వన్ కార్పొరేషన్ ఫ్యాక్టరీలకు శంకుస్థాపన చేశామన్నారు. అన్ని యూనిట్లు ప్రారంభమైతే వరంగల్ ప్రధాన వస్త కేంద్రంగా మారబోతోందన్నారు. ఫార్మ్ టు ఫ్యాషన్ నినాదంతో టెక్స్ టైల్ పార్క్ స్థాపించామని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ టీఎస్‍ఐపాస్ సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ విధానం వల్లే ఇదంతా సాధ్యమైందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -