Saturday, March 28, 2026
E-PAPER
Homeకరీంనగర్సిరిసిల్లలో 39వ వార్డు కార్యాలయాన్ని ప్రారంభించిన కేటీఆర్

సిరిసిల్లలో 39వ వార్డు కార్యాలయాన్ని ప్రారంభించిన కేటీఆర్

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 39 వ వార్డు కార్యాలయంను సిరిసిల్ల ఎమ్మెల్యే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ప్రారంభించారు. కేటీఆర్ వార్డు కౌన్సిలర్ ఆకుల స్వప్న కు శాలువా కప్పి బొకేను అందజేసి అభినందనలు తెలిపారు. కేటీఆర్ కార్యాలయం ప్రారంభోత్సవానికి రాగానే ఆయనతో అభిమానులు ఫోటోలు దిగడానికి పోటీపడ్డారు. వార్డ్ ప్రజల అభిమానం చూరగొట్టు వార్డు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని కేటీఆర్ పేర్కొన్నారు. వార్డు ప్రజల కష్టసుఖాల్లో  పాలుపంచుకున్నప్పుడే గెలుపుకు సార్ధకత ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి చీటీ నరసింగారావు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ గుడ్ల మంజుల, అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు రాపెళ్లి లక్ష్మీనారాయణ మ్యాన రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -