దుబాయ్‌లో జనవరి 9 నుంచి 11 వరకు నిర్వహణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కె తారక రామారావు (కేటీఆర్)కు అంతర్జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది. వచ్చేనెల తొమ్మిది నుంచి 11 వరకు దుబాయ్‌లో జరిగే అంతర్జాతీయ జునికార్న్, గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్‌లో గౌరవ అతిథిగా పాల్గొనా లని ప్రతినిధులు శనివారం ఆహ్వానించారు. నూతన ఆవిష్కరణలు, స్టార్టప్ రంగాల్లో కేటీఆర్ చేసిన కృషిని గుర్తిస్తూ ఈ ఆహ్వానం పంపించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఫిన్‌టెక్, హెల్త్‌కేర్, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత వంటి రంగాల్లో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లాభాపేక్ష లేని సంస్థ అంతర్జాతీయ స్టార్టప్ ఫౌండేషన్ (ఐఎస్‌ఎఫ్) ఈ సదస్సును నిర్వహిస్తున్నది. ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు వంద మందికిపైగా అంతరా ్జతీయ కంపెనీల సీఈవోలు, పెట్టుబడిదారులు, పారిశ్రా మికవేత్తలు, యువ ఆవిష్కర్తలు పాల్గొంటారు. జునికార్న్ 100కె చొరవ ద్వారా గ్రామీణ యువతలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడంపై ఈ సదస్సు ప్రధానం గా దృష్టిసారించనుంది. ఈ అంతర్జా తీయ వేదికపై కేటీఆర్ భాగస్వామ్యం యువ ఆవిష్కర్తలకు స్ఫూర్తి నిస్తుందనీ, తెలంగాణ ఇన్నోవేషన్ మోడల్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుందని నిర్వాహకులు ఆకాంక్షించారు.
అంతర్జాతీయ ఇన్నోవేషన్ సమ్మిట్‌కు కేటీఆర్‌కు ఆహ్వానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



