Monday, November 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి: నా రెడ్డి

కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి: నా రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి 
గ్రూప్ వన్ అభ్యర్థుల పట్ల ఆరోపణలపై, కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని శుక్రవారం జిల్లా పరిషత్ మాజీ  ఫ్లోర్ లీడర్ మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రూ.3 కోట్లకు విక్రయాలు జరిగినాయి అని ఆరోపించిన కేటీఆర్, గత పది సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వకుండా, ప్రజలను చైతన్యపరులను చేయకుండా, గొర్రెలను, బార్లను పంపిణీ చేసి “బాంచన్ దొర”అనే విధంగా మీరు దొరల పాలన సాగించారని లన్నారు. ప్రజా ప్రభుత్వాన్ని బదినం చేయడానికి, సంవత్సరాల తరబడి ఒక్కపూట భోజనం చేసి, రాత్రింబవళ్లు కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదిస్తే వారిని అవమాన పరుస్తూ చేసిన ఆరోపణలు ఖండిస్తున్నామని అన్నారు. బహిరంగంగా క్షమాపణ చెప్పకుంటే కోర్టుకు ఈడుస్తామని ఆయన హెచ్చరించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -