Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుబీసీ రిజర్వేషన్ బిల్లుకు కేటీఆర్ మద్దతు..

బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేటీఆర్ మద్దతు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మంత్రి సీతక్క పంచాయతీ రాజ్ లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుపై చర్చ ప్రారంభమవ్వగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయతీరాజ్ బిల్లులో రాజకీయ, సామాజిక స్థితిగతులు లేవన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వంలో తాము భాగస్వాములుగా ఉన్నామని గుర్తు చేశారు. బీసీల రిజర్వేషన్ బిల్లును అమలు చేయడం తమకు ఇష్టం లేదని సీఎం చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు.

రాష్ట్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలని కేసీఆర్ సూచించారని కేటీఆర్ తెలిపారు. అలాగే బీసీలకు బీఆర్ఎస్ పార్టీ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ పదవులను ఇచ్చింది, బీసీని మొదటి అడ్వొకేట్ జనరల్ గా చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని తెలిపారు. తమ పార్టీలో 3 ప్రొటోకాల్ పొజిషన్లను బీసీలకే ఇచ్చామని స్పష్టం చేశారు. చట్టసభల్లోనూ రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేశామని పేర్కొన్నారు.

బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలని, 50 శాతం సీలింగ్ తీసేలా రాజ్యాంగ సవరణ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే నాలుగుసార్లు మాట మార్చారని, సీఎం చిత్తశుద్ధి ఏ స్థాయిలో ఉందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. బీసీ సబ్ ప్లాన్ చట్టంపై చర్చ జరిపేందుకు సభ నిర్వహించాలని కేటీఆర్.. మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరారు. దీనికి స్పందించిన పొన్నం ప్రభాకర్.. కచ్చితంగా ఒకరోజు దీనిపై చర్చిస్తామని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad