- Advertisement -
నవతెలంగాణ – పరకాల
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ రేపు (ఆదివారం) పరకాలకు రానున్నట్లు నడికూడ మండల మాజీ వైస్ ఎంపీపీ కుమారస్వామి తెలిపారు. పరకాల పట్టణంలోని లలిత కన్వెన్షన్ లో జరిగే పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ పొందిన సుమారు 500 మంది మహిళలకు ఈ సందర్భంగా కేటీఆర్ కుట్టు మిషన్ల పంపిణీ చేయనున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే చాలా ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -