Thursday, October 23, 2025
E-PAPER
Homeతాజా వార్తలునవంబర్ లో కొలంబోకు కేటీఆర్

నవంబర్ లో కొలంబోకు కేటీఆర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అంతర్జాతీయ వేదిక నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. శ్రీలంక రాజధాని కొలంబోలో జరగనున్న ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్ ఎకనామిక్ అండ్ టెక్నాలజీ సమ్మిట్-2025’లో కీలక ప్రసంగం చేయాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. ఈ మేరకు శ్రీలంక సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తరఫున శ్రీలంక డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఏయూఎల్ఏ హిల్మీ ఇటీవలే కేటీఆర్‌కు ఆహ్వాన పత్రం పంపారు. నవంబర్ 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కొలంబోలోని ‘ది కింగ్స్‌బరీ హోటల్‌’లో ఈ సదస్సు జరగనుంది. కేటీఆర్ ఈ కార్యక్రమానికి హాజరై ప్రసంగించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులు, ఆవిష్కరణలు (ఇన్నోవేషన్), డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ప్రాంతీయ సహకారం వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -