నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం అందింది. బ్రిటన్‌లో జరిగే ఐడియాస్ ఫర్ ఇండియా – 2025 సదస్సుకు రావాలంటూ బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఈ ఏడాది మార్చి నెలలో కేటీఆర్‌ను ఆహ్వానించింది. ఈ ఆహ్వానం మేరకు మే 30న లండన్‌లోని రాయల్ లాంకాస్టర్ హోటల్‌లో జరిగే సదస్సుకు కేటీఆర్ ముఖ్య వక్తగా వెళ్లనున్నారు. తాజాగా లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ సర్వీసెస్ సంస్థ ప్రోగ్మాటిక్ డిజైన్ సొల్యూషన్ లిమిటెడ్ (పీడీఎస్ఎల్) యూకేలోని వార్విక్ టెక్నాలజీ ఫార్మ్‌లో ఏర్పాటు చేసిన తమ నూతన కేంద్రాన్ని ప్రారంభించాల్సిందిగా కేటీఆర్‌ను ఆహ్వానించింది. ఈ ఆహ్వానం మేరకు మే 30నే కేటీఆర్ వార్విక్ యూనివర్సిటీ సైన్స్ పార్క్‌లోని పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.
30న బ్రిటన్ వెళ్లనున్న కేటీఆర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES