Friday, May 2, 2025
Homeట్రెండింగ్ న్యూస్ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్‌కు కేటీఆర్..

ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్‌కు కేటీఆర్..

నవతెలంగాణ – హైదరాబాద్: జూన్ 20, 21 తేదీల్లో ఇంగ్లాండ్‌లో జరిగే ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్ వార్షిక సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొనాలని నిర్వాహకులు బీఆర్ఎస్ అధ్యక్షులు కేటీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు.’భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు’ అనే అంశంపై ఈ సదస్సు జరగనుంది. ఈ సమావేశంలో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పూర్వ, ప్రస్తుత విద్యార్థులు, ఆచార్యులతో పాటు వివిధ దేశాల నిపుణులు పాల్గొంటారు. భారతదేశ ప్రగతి ప్రస్థానం, తెలంగాణలో అమలు చేసిన వినూత్న విధానాలు, సాంకేతికత ఆధారిత అభివృద్ధి నమూనాపై కేటీఆర్ తన అనుభవాలను, ఆలోచనలను పంచుకోనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img