Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంకాంగ్రెస్‌ హామీలపై గూగుల్‌ స్కానర్‌ పోస్టర్‌ ఆవిష్కరించిన కేటీఆర్‌

కాంగ్రెస్‌ హామీలపై గూగుల్‌ స్కానర్‌ పోస్టర్‌ ఆవిష్కరించిన కేటీఆర్‌

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను గుర్తుచేసేలా గూగుల్‌ స్కానర్‌ పోస్టర్‌ను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విడుదల చేశారు. బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం కార్యదర్శి రాజేష్‌ నాయక్‌ దీనిని రూపొందించారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లా డుతూ ఇప్పటికైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం కన్ను తెరిచి, యువతను మోసం చేసిన తీరును గమనించి, తక్షణమే తమ హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పలువురు బీఆర్‌ఎస్వీ నేతలు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు యువతను మోసం చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన యూత్‌ డిక్లరేషన్‌, 420 హామీలు, జాబ్‌ క్యాలెండర్‌ వంటి హామీలు నేటికీ కేవలం కాగితపు ప్రకటనలుగానే మిగిలాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరును బహిర్గతం చేయడమే ఈ ప్రచార పోస్టర్‌ లక్ష్యమని తెలిపారు. దాదాపు సంవత్సరం గడుస్తున్నా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వకుండా నిరుద్యోగుల ఆశలపై కాంగ్రెస్‌ నీళ్లు చల్లిందని వారు అసహనం వ్యక్తం చేశారు. ఈ పోస్టర్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూఆర్‌ కోడ్‌ ద్వారా కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో, యూత్‌ డిక్లరేషన్‌, 420 హామీలు, రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క ఇచ్చిన హామీల వీడియోలు అన్ని ఒకే చోట పొందుపర్చినట్టు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img