నవతెలంగాణ – రామారెడ్డి
గద్వాలలో కేటీఆర్ మాట్లాడిన గాలి మాటలను ఖండిస్తున్నామని, కేటీఆర్ కు త్వరలో బుద్ధి చెప్పడం ఖాయమని జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి హెచ్చరించారు. కేటీఆర్ ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు భరోసా కల్పించవలసిన నీవు, సీఎం పదవినీ అగౌరవపరచి, నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకుండేది లేదని, ప్రజా ప్రభుత్వా అభివృద్ధిని చూడలేక, పిచ్చికుక్కలా మాట్లాడడం సరికాదని, ఇకనుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అవహేళన చేస్తే ఊరుకుండేది లేదని, నీవు కామారెడ్డి జిల్లాలో అడుగుపెట్టి చూడని సవాలు విసిరారు. కాంగ్రెస్ శ్రేణులo నీవు బయటకెళ్తే ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. దొర బలుపుతో మాట్లాడితే, నీకు వాతలు తప్పవని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉండి సమాజానికి ఇలాంటి సమాచారం ఇవ్వడం దుర్మార్గపు ప్రతిపక్ష నేత కుమారుడు ఉండడం మన దూరదృష్టమని పేర్కొన్నారు.
కేటీఆర్ కు త్వరలో బుద్ధి చెప్పేది ఖాయం: నారెడ్డి మోహన్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES