నవతెలంగాణ – వేములవాడ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని బి ఆర్ ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వేములవాడలో బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు.అనంతరం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కోడె మొక్కు చెల్లించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, “గత పదేళ్లలో కేటీఆర్ నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయి,ఆయన సేవా భావం మరువలేనిది,” అని పేర్కొన్నారు.‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం భాగంగా చెల్మడ ఇంటివద్ద, వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బాలింతలకు సుమారు 200 కేసీఆర్ కిట్లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ తిరుపతి రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, నిమ్మచెట్టి విజయ్,మారం కుమార్, నరాల శేఖర్, జోగిని శంకర్, సిరిగిరి చందు, సీనియర్ నాయకులు రామతీర్థపు రాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్,నాయకులు నరాల దేవేందర్, వాసాల శ్రీనివాస్, నీలం శేఖర్, వెంగళ శ్రీకాంత్ గౌడ్, ప్రేమ్ చారి, మల్లేశం, వెంకట్ రెడ్డి, ముద్రకోల వెంకన్న, కొండ కనుకయ్య, సుంకపాక రాజు, రవిచంద్ర గౌడ్, కమలాకర్ రెడ్డి, అంజద్ పాషా, పర్వేజ్, ఉమర్, రఫీ, పోతు అనిల్ కుమార్, మంత సందీప్, సాయి పటేల్, మిద్దె వినీత్ తో పాటు తదితరులు ఉన్నారు.