యువజన కాంగ్రెస్ భారీ ఆందోళన
నవతెలంగాణ – జుక్కల్
లోక్ సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసభ్యకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ మాట్లాడిన మాటలను నిరసిస్తూ..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్ సూచనల మేరకు, జుక్కల్ మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ పటేల్, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ వద్ద కేటీఆర్ దిష్టిబొమ్మను ఉరితీసి, నడిరోడ్డుపై నిప్పంటించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు సజ్జనవర్ సాయి, వగమారే సురేష్, జుక్కల్ ఉపసర్పంచ్ ప్రిదోష్ ,పాకాల వెంకటేష్, నల్లవార్ ప్రసాద్, కంటలి సర్పంచ్ నగ్నత్, బంగారపల్లి సర్పంచ్ మణికరావు పటేల్, విజయ్ సార్, సాయి, బాబు,రాజు, బస్వరాజ్, సతీష్ కేశవ్,రామ్ గోండా యూత్ నాయకులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ చౌరస్తాలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



