Saturday, May 17, 2025
Homeరాష్ట్రీయంఅహంకారానికి ఐడీ కార్డు కేటీఆర్‌

అహంకారానికి ఐడీ కార్డు కేటీఆర్‌

- Advertisement -

ఫిషర్మెన్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ మెట్టుసాయి కుమార్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

మాజీ మంత్రి కేటీఆర్‌ అహంకారానికి ఐడీ కార్డు…దురహంకారానికి ఆధార్‌ కార్డు లాంటి వారని ఫిషర్మెన్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ మెట్టు సాయికుమార్‌ ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. అందాల పోటీల్లో పాల్గొంటున్న మహిళలు రామప్ప గుడి వద్ద తమ కాళ్లు తామే కడుక్కుంటున్న వీడియోలను ఆయన తప్పుగా ప్రచారం చేశారని విమర్శించారు. ఆ విషయంపై కేటీఆర్‌ ఎక్స్‌లో అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ నాయకులు తమ స్థితి, గతి, మతి కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. కేటీఆర్‌ మతి పోయిందా? ఆయన దగ్గర పని చేస్తున్న సిబ్బందికి మతిపోయిందా? అని ప్రశ్నించారు. ఈ క్రమంలో కేటీఆర్‌ ఎర్రగడ్డలో చికిత్స చేయించుకునేందుకు తగిన సాయం చేస్తామని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. సీఎంకు ఎక్కడ మైలేజ్‌ వస్తుందోనన్న అక్కసుతో ఆయన ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. తన పిల్ల చేష్టలు, చిల్లర పోస్టులతో తెలంగాణ ఆడపడుచులను కేటీఆర్‌ ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -