Thursday, January 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొత్త సంవత్సరం నాడే కేటీఆర్ అబద్ధాలు 

కొత్త సంవత్సరం నాడే కేటీఆర్ అబద్ధాలు 

- Advertisement -

చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ
నవతెలంగాణ – ఆలేరు 

నూతన సంవత్సరం తొలిరోజే బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి రామారావు అబద్ధాలతో గ్లోబల్ ప్రచారం మొదలుపెట్టారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. గురువారం నవతెలంగాణతో మాట్లాడుతూ.. కృష్ణ,గోదావరి నది జలాలపై పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులపై మీ బావ హరీష్ రావు  పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, నీళ్ల విషయం ద్వారా తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలని చేస్తున్న మీ ఎత్తుగడలు తెలంగాణ ప్రజలు గ్రహించలేనంత అమాయకులు కాదన్నారు. అబద్దాలతో 10 ఏళ్లు పరిపాలన చేశారు కానీ ప్రజలు వాస్తవాలు తెలుసుకొని మీ నాయనను ఫామ్ హౌస్ కి పరిమితం చేశారు. బి ఆర్ ఎస్ పార్టీ అవయవ దానం చేయబట్టే బిజెపి గెలిచిందన్నారు. బిజెపి పార్టీ మళ్ళీ లేచే పరిస్థితి బి ఆర్ ఎస్ పార్టీని చేజితులారా చేసుకున్న మీ మాటలు ఎవరు నమ్మడం లేదన్నారు. కేంద్ర మంత్రి నడ్డాను ఒప్పించి  వానకాలం పంటకు 9.79 మెట్రిక్ టన్నుల యూరియా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందన్నారు. యూరియా విషయంలో మీ ప్రభుత్వ హయాంలో ప్రస్తుతం వచ్చిన యూరియా లెక్కలు చూసి మాట్లాడాలని కే టీ ఆర్ కు హితువు పలికారు. లెక్కలు కావాలంటే నీకు పంపించడానికి సిద్ధమన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -